Medchal Malkajgiri Collectorate: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

Bomb Threat at Medchal Malkajgiri Collectorate

  • కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు మెయిల్ ద్వారా బెదిరింపు
  • పోలీసులకు సమాచారం అందించిన అధికారులు
  • అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదన్న పోలీసులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలెక్టరేట్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

అయితే, అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు, బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Medchal Malkajgiri Collectorate
Bomb Threat
Cyber Threat
Email Bomb Threat
Police Investigation
Bomb Scare
Dog Squad
Telangana Police
Security Breach
  • Loading...

More Telugu News