Nani: నాని 'పారడైజ్' పై రూమర్లు... స్పందించిన మేకర్స్

Nanis The Paradise Movie Makers Respond to Rumors

  • ప్యారడైజ్' సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు 
  • సినిమా పనులు యథావిధిగా జరుగుతున్నాయన్న మేకర్స్
  • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న మూవీ

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, బడ్జెట్ ఎక్కువ కావడంతో సినిమా ఆగిపోయిందని కొన్ని వార్తలు వచ్చాయి. 

అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రస్థాయిలో స్పందించింది. ఇవన్నీ పుకార్లేనంటూ ఖండించింది. సినిమా నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయని, ఎటువంటి ఆటంకాలు లేవని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవాళ్లు తమ దృష్టిలో జోకర్లని పేర్కొంది.

నిర్మాణ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... "ది ప్యారడైజ్ చిత్ర నిర్మాణం అనుకున్న ప్రకారం జరుగుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. త్వరలోనే మంచి అప్ డేట్స్ తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిపై పరోక్షంగా స్పందిస్తూ.. విమర్శలను పట్టించుకోకుండా సినిమాను పూర్తి చేసేందుకు తమ బృందం అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో 'దసరా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభపై నమ్మకంతో ఉన్నామని, 'ది ప్యారడైజ్' చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.  'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని, సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూడాలని అభిమానులకు నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nani
The Paradise
Srikanth Odela
Telugu Movie
Nani Movie
Tollywood
Movie Updates
Telugu Cinema
Film News
Movie Rumors
  • Loading...

More Telugu News