Mithun Reddy: మిథున్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు

High Court Rejects Mithun Reddys Bail Plea

  • వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని కేసు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి
  • మిథున్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో తన పేరు చేర్చి అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానంతో హైకోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు... మార్చి 3న తీర్పును వెలువరిస్తామని... అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈరోజు మిథున్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

వాదనల సందర్భంగా సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, ఆయనకు నోటీసులు ఇవ్వలేదని, విచారణకు హాజరు కావాలని ఆదేశించలేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు బెయిల్ కోరడానికి వీల్లేదని చెప్పారు.

Mithun Reddy
AP High Court
Bail Petition
Liquor Scam
YSRCP MP
CID
Andhra Pradesh Politics
Pre-Arrest Bail
Sidharth Luthra
  • Loading...

More Telugu News