అర్ధాంగి భువనేశ్వరికి పట్టుచీర కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ధర ఎంతంటే ..?
- బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- చీరాల పట్టు చీరలు చూసి ఆకర్షితుడైన చంద్రబాబు
- రూ.12వేలు చెల్లించి పట్టుచీర కొనుగోలు
ఆయన చీరాల పట్టుచీరల శ్రేణిని ప్రత్యేకంగా పరిశీలించారు. జాండ్రపేటకు చెందిన చేనేత కార్మికురాలు, పొదుపు సంఘ సభ్యురాలు చింతం మయూరి వద్ద ఆయన తన భార్య భువనేశ్వరి కోసం రూ.12 వేలు చెల్లించి పట్టుచీరను కొన్నారు.
వ్యాపారం వృద్ధి చెందేలా చూసుకోవాలని, నెలకు కనీసం రూ.40 నుండి 50 వేల వరకు సంపాదించాలని చంద్రబాబు ఆమెకు సూచించారు. ముఖ్యమంత్రి స్వయంగా తన వద్ద పట్టుచీరను కొనుగోలు చేయడంతో చేనేత కార్మికురాలు చింతం మయూరి సంతోషం వ్యక్తం చేశారు.