ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
- సీఎస్ కే కోచ్ లు ధోనికి భయపడుతున్నారేమో..
- బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో తుదినిర్ణయం ధోనీదేనా అంటూ ప్రశ్న
- మ్యాచ్ ఆడేది గెలవడానికేనని గుర్తుంచుకోవాలన్న తివారీ
ఈ విషయంలో సీఎస్కే మేనేజ్ మెంట్ కానీ, కోచ్ లు కానీ ధోనికి వాస్తవ పరిస్థితులను చెప్పడంలో వెనుకాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. బహుశా ధోనికి సలహా ఇచ్చేందుకు వారు భయపడి ఉంటారని, అందుకే ముందుగా బ్యాటింగ్ కు వెళ్లాలని చెప్పలేకపోయారని అన్నారు. ఏ స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లాలనే విషయంలో ధోనీ తనకుతానుగా నిర్ణయించుకుంటాడని అన్నాడు. ఒకసారి ధోనీ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇంతకీ ధోనీ గెలవడానికే మ్యాచ్ ఆడుతున్నాడా అని సెటైర్ వేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ధోనీ పునరాలోచించుకోవాలని, మరింత ముందు బ్యాటింగ్ కు దిగాలని తివారీ విజ్ఞప్తి చేశాడు.