Rajeev Yuva Vikasam Scheme: 'రాజీవ్ యువ వికాసం పథకం' దరఖాస్తుల గడువు పొడిగింపు

Rajeev Yuva Vikasam Scheme Application Deadline Extended

  • ఏప్రిల్ 14వ తేదీ వరకు గడువు పొడిగింపు
  • ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని భట్టివిక్రమార్క ఆదేశం
  • వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, పలువురు కలెక్టర్లు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'రాజీవ్ యువ వికాసం' పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు కలెక్టర్లు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ-1 కింద రూ. 1 లక్ష, కేటగిరీ-2 కింద రూ. 2 లక్షలు, కేటగిరీ-3 కింద రూ. 3 లక్షల రుణాలను అందజేయనుండగా, వరుసగా 80 శాతం, 70 శాతం, 60 శాతం రాయితీ లభిస్తుంది.

Rajeev Yuva Vikasam Scheme
Telangana Government
Malla Reddy
Shridhar Babu
Unemployment
Loan Scheme
Telangana
Youth Development
Government Schemes
Loan Application Deadline Extension
  • Loading...

More Telugu News