ఎయిర్ అంబులెన్సులో హుటాహుటిన కొడాలి నాని ముంబైకి తరలింపు... వెంట ముగ్గురు వైద్యులు
- ఈ నెల 26న గుండెపోటుకు గురైన కొడాలి నాని
- కొడాలి నానికి మూసుకుపోయిన మూడు వాల్వ్స్
- క్రిటికల్ సర్జరీ చేయాలన్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు
నానికి మూడు వాల్వ్స్ మూసుకుపోయాయని కాసేపటి క్రితం వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. క్రిటికల్ సర్జరీ చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో, ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఈ క్రమంలో, సమయం వృథా చేయకుండా ఆయనను హుటాహుటిన ముంబైకి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కొడాలి నానిని లిఫ్ట్ చేశారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్ లో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు కూడా బయల్దేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.