వొడాఫోన్ ఐడియాలో మరింత పెరగనున్న కేంద్ర ప్రభుత్వ వాటా
- ప్రభుత్వానికి దాదాపు 37వేల కోట్ల విలువైన షేర్లు జారీ చేసిన వోడాఫోన్ ఐడియా
- వీఐలో 49 శాతానికి పెరగనున్న ప్రభుత్వ వాటా
ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
సెప్టెంబర్ 2021 టెలికాం రంగ సంస్కరణలు, మద్దతు ప్యాకేజీకి అనుగుణంగా వేలం బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునేందుకు నిర్ణయించినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ ఫైలింగ్‌లో వెల్లడించింది.