జాన్వీ సొగసు చూడతరమా... ర్యాంప్ పై వయ్యారం ఒలకబోసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ

  • ముంబయిలో లాక్మే ఫ్యాషన్ వీక్
  • ఇతర మోడల్స్ తో కలిసి ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్
  • ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకర్షణీయంగా బాలీవుడ్ బ్యూటీ 
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలతోనే కాదు, వాణిజ్య ప్రకటనలతోనూ ఫుల్ బిజీ. దీనికి తోడు ఫ్యాషన్ వీక్ లతోనూ అమ్మడు అలరిస్తోంది. తాజాగా ముంబయిలో జరిగిన ప్రఖ్యాత లాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ చేసింది. 

ఇతర మోడల్స్ తో కలిసి ఆమె వయ్యారంగా నడిచి వస్తుంటే ఫ్యాషన్ వీక్ కు హాజరైనవారు స్టన్ అయ్యారు. ప్రొఫెషనల్ మోడల్స్ కు తీసిపోని రీతిలో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ... ట్రెండీ అవుట్ ఫిట్ లో జిగేల్మంది. ర్యాంప్ పై జాన్వీ సోయగాలు నెట్టింట కుర్రకారును గిలిగింతలు పెడుతున్నాయి. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

Janhvi Kapoor
Lakme Fashion Week
Ramp Walk
Bollywood Actress
Mumbai Fashion Week
Indian Fashion
Janhvi Kapoor Ramp Walk Video
Bollywood Celebrity
Fashion Show

More Telugu News