ఉగాది రోజున పొలంలో ఎంపీ కలిశెట్టి ఏరువాక సేద్యం... వీడియో ఇదిగో!
--
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తొలిసారి ఏరువాక నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మంచి పథకాలు తీసుకు వస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.