విష్ణుప్రియకు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court Rejects Vishnupriyas Plea
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలంటూ విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయింది. ఈ నెల 25న ఆమె మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది. 

ఈ క్రమంలో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. చట్ట ప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Vishnupriya
Telangana High Court
Betting Apps
Social Media Influencer
Police Investigation
FIR
Celebrity Endorsement
Legal Case
Panjagutta Police
Hyderabad

More Telugu News