హైదరాబాద్‌లో పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదు?: అక్బరుద్దీన్ ఒవైసీకి ఆకునూరి మురళి కౌంటర్
- సీతక్కకు హిందీ, ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
- మంత్రికి హిందీ రాదు సరే... నీకు తెలుగు ఎందుకు రాదని ఆకునూరి మురళి ప్రశ్న
- అక్బరుద్దీన్‌కు సామాజిక బాధ్యత ఉండాలని వ్యాఖ్య
"మంత్రిగారికి హిందీ రాదు సరే, మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు? హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినవు కదా! రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాషా తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత నీకు ఉండాలి కదా" అంటూ చురక అంటించారు.
అసెంబ్లీలో అందరు సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏదో ఒకటి అసెంబ్లీలో ప్రసంగం దంచేసి వెళ్లిపోతే సరిపోతుందా అని విమర్శించారు. తెలుగు రాకపోతే రాష్ట్రంలోని సమస్యలు మీకెలా అర్థమవుతాయని ప్రశ్నించారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే నీకు అంత చిన్నచూపా? పొగరు కాకపోతే! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.