నేడు కడప జడ్పీ ఛైర్మన్ ఎన్నిక.. హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్న వైసీపీ సభ్యులు
- ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు
- తమ సభ్యులకు విప్ జారీ చేసిన వైసీపీ
- పోటీకి దూరంగా ఉంటామన్న టీడీపీ
జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో, ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను నాలుగు రోజుల పాటు క్యాంపులో ఉంచారు. వైసీపీ జడ్పీటీసీలు హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్నారు. తమ సభ్యులకు వైసీపీ విప్ జారీ చేసింది. ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని టీడీపీ ప్రకటించినప్పటికీ... చివరి నిమిషంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.