Vallabaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Vamsis Bail Petition CID Court Reserves Judgement

  • గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు
  • వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు సీఐడీ కోర్టులో వాదనలు
  • తీర్పు ఎల్లుండికి వాయిదా వేసిన న్యాయస్థానం

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును ఈ నెల 27వ తేదీకి రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో వంశీ బెయిల్ కోసం సీఐడీ కోర్టును ఆశ్రయించారు. 

అయితే, వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 

మరోవైపు, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను జైలు అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది. 

Vallabaneni Vamsi
Bail Petition
CID Court
Gannavaram TDP Office Attack
TDP
YSRCP
Satya Vardhan Kidnap Case
Andhra Pradesh Politics
Criminal Case
Bail Hearing
  • Loading...

More Telugu News