ఐఐటీ బాంబే క్యాంపస్ లో హడలెత్తించిన మొసలి

  • ఐఐటీ బాంబే క్యాంపస్ లోకి వచ్చిన భారీ మొసలి
  • భయాందోళనకు గురైన విద్యార్థులు, అధ్యాపకులు
  • సోషల్ మీడియాలో మొసలి వీడియో వైరల్
మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఒక భారీ మొసలి రోడ్డుపై సంచరించడం తీవ్ర కలకలం రేపింది. సమీపంలోని సరస్సు నుంచి క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఈ మొసలిని చూసి విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనలకు గురయ్యారు.

మొసలిని గమనించిన కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు తమ చరవాణిలో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు సంఘటన స్థలానికి చేరుకుని మొసలి వల్ల ఎవరికీ ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత అది స్వయంగా పావై సరస్సులోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐఐటీ బాంబేకి మొసలి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానించగా, పావై సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు సాధారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

IIT Bombay
Crocodile
Powai Lake
Viral Video
Maharashtra
Campus
Social Media
Students
Faculty
Wildlife

More Telugu News