అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు

  • పంజాబ్ లో పర్యటించిన లోకేశ్ కుటుంబం
  • స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు
  • అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించానన్న లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ నేడు కుటుంబ సమేతంగా పంజాబ్ లో పర్యటించారు. అమృత్ సర్ లో ఉన్న సిక్కుల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. స్వర్ణ దేవాలయంలో లోకేశ్ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

దీనిపై లోకేశ్ స్పందిస్తూ... అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయ సందర్శన సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ సిక్కు మతాచారాల ప్రచారం తలకు పవిత్రమైన వస్త్రాన్ని కట్టుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Your browser does not support HTML5 video.


More Telugu News