Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. 5.30 లక్ష‌ల మంది లీగ‌ల్ స్టేట‌స్ క్యాన్సిల్‌!

530000 Immigrants Lose Legal Status in US Under Trumps New Order
  • ఇప్ప‌టికే అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ స‌ర్కార్ ఉక్కుపాదం
  • ఇప్పుడు తాత్కాలిక వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ క‌న్నెర్ర 
  • దేశంలో తాత్కాలిక నివాస హోదాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఈ నిర్ణ‌యంతో అమెరికాను వీడ‌నున్న‌ దాదాపు 5.30 ల‌క్ష‌ల మంది 
  • వీరంద‌రూ క్యూబా, హైతీ, నిక‌రాగ్వా, వెనిజులా దేశాల‌కు చెందిన పౌరులు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ‌ల‌స‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ స‌ర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారిని దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ క‌న్నెర్ర చేశారు. 

దేశంలో తాత్కాలిక నివాస హోదాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంతో క్యూబా, హైతీ, నిక‌రాగ్వా, వెనిజులా దేశాల‌కు చెందిన దాదాపు 5.30 ల‌క్ష‌ల మంది పౌరులు అమెరికా వీడ‌నున్నారు. దాదాపు ఒక నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది. 

ఈ ఆర్డర్ 2022 అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన నాలుగు దేశాలకు చెందిన‌ దాదాపు 5,32,000 మందికి వర్తిస్తుంద‌ని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తెలిపారు. ఏప్రిల్ 24తో వారి లీగ‌ల్ స్టేట‌స్ ర‌ద్ద‌వుతుంద‌ని వెల్ల‌డించారు. 

ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు ప్రచురించబడిన 30 రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు. కాగా, యుద్ధం లేదా ఇత‌ర కార‌ణాల‌తో అనిశ్చితి నెల‌కొన్న దేశాల‌కు చెందిన పౌరుల‌కు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం క‌ల్పిస్తారు.  
Donald Trump
Immigration
US Immigration Policy
Temporary Protected Status
TPS
Cuba
Haiti
Nicaragua
Venezuela
Deportation
Legal Status Cancellation

More Telugu News