ఎయిరిండియాలో విమానంలో ప్రయాణికుడి మృతి!
- ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన ఎయిరిండియా విమానంలో ఘటన
- మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గుర్తింపు
- ఆసిఫ్ మృతికి గల కారణాలు తెలియని వైనం
వెంటనే విమానంలో ఉన్న ఓ వైద్యుడు ఆ వ్యక్తిని పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. దాంతో సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా అధికారులు గుర్తించారు.
విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండడం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో ఫ్లైట్ గాల్లో ఉండగానే ఆసిఫ్ చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన అధికారులు... అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు. ఆసిఫ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.