ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు
- 1950లలో ‘గ్రామయాత్ర’ పేరుతో చిత్రించిన ఎంఎఫ్ హుస్సేన్
- ఈ నెల 19న న్యూయార్క్‌లోని క్రిస్టీలో వేలం
- అమృతా షేర్‌గిల్ చిత్రం ‘ది స్టోరీ టెల్లర్’ రికార్డు బద్దలు
14 అడుగుల కాన్వాస్ కలిగి ఉన్న హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం.. అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.