ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్.. 14 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం!
తొలగింపులన్నీ మేనేజర్ స్థాయిలోనే ఉంటాయని సమాచారం. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఇటీవల కమ్యూనికేషన్స్, సస్టెయిన్బిలిటీ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరో 14 వేల మందిపై వేటుకు రంగం సిద్ధం చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో అమెజాన్ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.