ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఫొటో సెషన్... పవన్ ను పలకరించిన బొత్స

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్
  • పాల్గొన్న చంద్రబాబు, పవన్, మంత్రులు
  • బాగున్నారా? అంటూ పవన్ ను పలకరించిన బొత్స
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది. 

మరోవైపు ఈ సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలకరించారు. 'ఎలా ఉన్నారు? బాగున్నారా?' అని బొత్స పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.


Botsa Satyanarayana
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News