కేసీఆర్ చావు కోరుకునేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ... సీఎం స్పీచ్ ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు
- తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య
- చంద్రబాబుని కలిసి ఉత్తమ్ దంపతులు భోజనం చేసి వచ్చారన్న హరీశ్
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ అన్నీ అబద్ధాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కలిశారని... ఆయనతో కలసి భోజనం చేసి వచ్చారని చెప్పారు.