Aamir Khan: బాలీవుడ్ పతనం కావడానికి కారణం ఇదే: ఆమిర్ ఖాన్

OTTs are main reason for Bollywood collapse says Aamir Khan
  • బాలీవుడ్ ని వెనక్కి నెట్టేసిన దక్షిణాది సినిమాలు
  • బాలీవుడ్ పతనానికి ఓటీటీలే కారణమన్న ఆమిర్ ఖాన్
  • ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవారని వ్యాఖ్య 
ఒకప్పుడు హాలీవుడ్ తర్వాత అంతటి వెలుగు వెలిగింది బాలీవుడ్. బాలీవుడ్ బడ్జెట్ ని కానీ, వసూళ్లను కానీ మన దేశంలోని ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలు అందుకోలేకపోయేవి. ఆ రోజుల్లో సౌత్ ఇండస్ట్రీని బాలీవుడ్ చులకనగా చూసేది. దక్షిణాది స్టార్ల గురించి నార్త్ ఆడియెన్స్ కు తెలిసేది కూడా కాదు. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులయింది. దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాయి. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. బాలీవుడ్ ఇలా పతనం కావడంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఉత్తరాది సినిమానా? లేక దక్షిణాది సినిమానా? అనేది ముఖ్యం కాదని ఆమిర్ అన్నారు. బాలీవుడ్ వెనుకబడటానికి ఓటీటీలే కారణమని చెప్పారు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవాళ్లని చెప్పారు. ఇప్పుడు సినిమా ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు వచ్చి చూడటం లేదని అన్నారు. సినిమాను ఎక్కడి నుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్ తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని చెప్పారు. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని కోరారు.
Aamir Khan
Bollywood

More Telugu News