Dil Raju: గద్దర్ అవార్డులపై దిల్ రాజు కీలక ప్రకటన

Dil Raju says will give gaddar awards from 2014 to 2023

  • 2014 నుండి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున అవార్డులు ప్రకటిస్తామని వెల్లడి
  • ఏప్రిల్‌లో అంగరంగా వైభవంగా అవార్డుల వేడుక నిర్వహిస్తామన్న దిల్ రాజు
  • గద్దర్ అవార్డుల విధివిధానాలు ఖరారయ్యాయన్న దిల్ రాజు

2014 నుండి 2023 వరకు ఏడాదికో ఉత్తమ చిత్రం చొప్పున గద్దర్ అవార్డులను ప్రకటిస్తామని ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. ఏప్రిల్‌లో అంగరంగ వైభవంగా అవార్డుల వేడుకను నిర్వహిస్తామని తెలిపారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా గద్దర్ అవార్డుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. 

2024 సంవత్సరానికి సంబంధించి కొన్ని మార్పులతో పాత విధానాన్నే అమలు చేస్తామని చెప్పారు.

గద్దర్ అవార్డుల విధివిధానాలను ఖరారయ్యాయని తెలిపారు. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో గౌరవ అవార్డులు ఇస్తామని వెల్లడించారు. 'సింహా' అవార్డుల దరఖాస్తులకు డబ్బులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News