Road Accident: లోయలో పడిన ట్రక్కు .. ముగ్గురు బీఎస్ఎఫ్ జవానుల మృతి
- లోయలో పడిన సైనికుల వాహనం
- మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఘటన
- అక్కడికక్కడే ఇద్దరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
వాహనం లోయలో పడటంతో ముగ్గురు బీఆర్ఎస్ జవానులు మృతి చెందిన ఘటన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 13 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సైనికులతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.