Amaravati: అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన

Once again Modi will inaugurate Amaravati works
  • 9 ఏళ్ల క్రితం అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన
  • వచ్చే నెలలో అమరావతి పనులకు శ్రీకారం
  • ఇప్పటికే పలు పనులకు టెండర్ల ఖరారు
  • ఒకేసారి మోదీ చేతుల మీదుగా అన్నిటికీ శంకుస్థాపన చేయించాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులను వచ్చే నెలలో పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 9 సంవత్సరాల క్రితం రాజధాని పనులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన చేతుల మీదుగా పనులను పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

వైసీపీ అధికారంలోకి రావడంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులు .. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈసారి కేంద్రం కూడా రాజధానికి అండగా నిలవడంతో పనులు జోరందుకోనున్నాయి. కేంద్రం చొరవతో అమరావతి నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ. 15 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. రూ. 11 వేల కోట్లు ఇచ్చేందుకు హడ్కో ఆమోదం తెలిపింది. 

మరోవైపు, రూ. 37,702 కోట్ల పనులకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. పనులన్నింటినీ ఒకేసారి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నారు.
Amaravati
Andhra Pradesh
AP Capital
Narendra Modi

More Telugu News