Narendra Modi: మారిషస్ అధ్యక్షుడికి పవిత్ర గంగాజలాన్ని కానుకగా ఇచ్చిన నరేంద్ర మోదీ

Modi gifts Maha Kumbh Gangajal to Mauritius President
  • మారిషస్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • గంగాజలంతో పాటు పలు బహుమతులు అందజేసిన నరేంద్ర మోదీ
  • మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్న నరేంద్ర మోదీ
మారిషస్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు మహా కుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర జలాన్ని అందించారు. నరేంద్ర మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవిత్ర జలంతో పాటు పలు బహుమతులను అందజేశారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

అంతకుముందు, మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలంతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఆ దేశ జాతిపిత సీవోసాగర్ రామ్ గోలం పేరు మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్‌ను వారు సందర్శించారు. ఇరువురు ప్రధానులు గార్డెన్‌లో చెరొక మొక్క నాటారు. అమ్మ పేరిట మొక్క నాటినట్లు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Narendra Modi
BJP
Kumbh Mela

More Telugu News