ఏపీ మహిళలపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఏపీ, బీహార్ మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదన్న మంత్రి దొరై మురుగన్
- తందై పెరియార్ పోరాటాల వల్ల తమిళనాడు మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందన్న మంత్రి
- మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు
తమిళనాడు, కేరళలో మహిళల విద్యకు తందై పెరియార్ పోరాటాలు చేసి మార్గదర్శిగా నిలిచారని, రాష్ట్రంలో తొలి వైద్యురాలిగా మత్తులక్ష్మీరెడ్డి రికార్డులకెక్కారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు మహిళలకు విద్యాహక్కు లేదని మంత్రి దొరై మురుగన్ వ్యాఖ్యానించారు.