ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి తమ్మయ్య బాబుపై సస్పెన్షన్ వేటు

  • ప్రభుత్వాసుపత్రిలో వీరంగం వేసిన తమ్మయ్య బాబు
  • విధుల్లో ఉన్న వైద్యురాలిపై చిందులు
  • తీవ్రంగా పరిగణించిన జనసేన హైకమాండ్
  • డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమంటూ ప్రకటన విడుదల
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై వరుపుల తమ్మయ్య బాబు దౌర్జన్యం చేసినట్టు తెలిసింది. ఓ వైద్యురాలితో ఆయన దురుసుగా ప్రవర్తించడాన్ని జనసేన అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. 

ప్రత్తిపాడు సీహెచ్ సీ ఘటనపై అందిన నివేదికలు, వివరణలను పరిగణనలోకి తీసుకుని తమ్మయ్య బాబును సస్పెండ్ చేసినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రత్తిపాడు సీహెచ్ సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరం అని ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా ఈ ఘటనపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. 


More Telugu News