తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కవిత
- ఇటీవల హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం
- మృతి చెందిన తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి
- కనిష్క్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కవిత
ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న కనిష్క్ రెడ్డి తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు, కనిష్క్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

