ఫైనల్ మ్యాచ్ పై 5 వేల కోట్ల బెట్టింగ్!
- భారత జట్టే ఫేవరెట్ గా పందాలు
- బుకీలకు అండర్ వరల్డ్ తో సంబంధాలు
- ఐదుగురు బుకీలను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో క్రైం బ్రాంచ్ పోలీసులు రెయిడ్స్ చేపట్టారు. బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలు ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ల్యాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ పైనా బెట్టింగ్ నిర్వహించినట్లు చెప్పారన్నారు. ఈ బెట్టింగ్ దందాను దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని, ప్రతీ మ్యాచ్ కు తమకు రూ.40 వేల చొప్పున కమీషన్ అందుతుందని తెలిపారు. రెండేళ్లుగా నెలకు రూ.30 వేలు చెల్లించి ఓ ఇంటిని ప్రత్యేకంగా ఈ దందా కోసమే అద్దెకు తీసుకున్నట్లు ప్రవీణ్ చెప్పాడు. ఆన్ లైన్ లో, మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్ లైన్ లోనూ పందాలు స్వీకరిస్తామని వివరించాడు. కాగా, వీరిద్దరితో పాటు వెస్ట్ ఢిల్లీకి చెందిన ఛోటూ బన్సాల్, మోతీనగర్ కు చెందిన వినయ్, మరొక బుకీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.