తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
- ఆదిలాబాద్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
- బస్సు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి మృతి
- నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
- హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి
మరో ఘటనలో, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన కుంచేల సాయి గౌడ్ (34), ప్రవీణ్ (32)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.