Actress Radhika: గాయం... ఆపై సర్జరీ... జీవితంలో క్లిష్ల పరిస్థితులను వివరించిన నటి రాధిక

- ఓ షూటింగ్ లో రాధిక మోకాలికి గాయం
- ఎన్ని మందులు వాడినా, థెరపీలు తీసుకున్నా నొప్పి తగ్గల్లేదని వెల్లడి
- చివరికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వివరణ
- భర్త శరత్ కుమార్ తనను పసిపాపలా చూసుకున్నాడన్న రాధిక
మహిళా దినోత్సవం సందర్భంగా నటి రాధిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఆమె తన పోస్ట్ లో వివరించారు. మహిళలు ఎప్పుడూ మనోధైర్యం కోల్పోకూడదని, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ఇటీవల ఓ షూటింగ్ లో తన మోకాలికి గాయమైందని వెల్లడించారు. ఎన్ని మందులు వాడినా, ఎన్నోరకాల చికిత్సలు చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదని వెల్లడించారు. అనేక థెరపీలు తీసుకున్నా నొప్పి తగ్గలేదని వివరించారు. చివరికి శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు.
సర్జరీకి వెళ్లే ముందే సినిమా చిత్రీకరణలు అన్నీ పూర్తి చేసుకున్నానని వెల్లడించారు. ఎంతో నొప్పిని భరిస్తూనే ఆ సినిమా షూటింగుల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. శస్త్రచికిత్స సమయంలో తన భర్త శరత్ కుమార్ తనను ఓ పసిపాపలా చూసుకున్నాడని వివరించారు. భర్త మద్దతును మరువలేనని అన్నారు.