Rahul Gandhi: గుజరాత్ కాంగ్రెస్‌లో కొందరు బీజేపీ కోసం పని చేస్తున్నారు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- బీజేపీతో కలిసి పనిచేసే వారిని బహిష్కరిస్తామన్న రాహుల్ గాంధీ
- బాధ్యతలు నెరవేర్చనంత వరకు అధికారం ఇవ్వాలని అడగకూడదన్న రాహుల్ గాంధీ
- గుజరాత్ ప్రజలు బీజేపీ 'బీ' టీంను కోరుకోవడం లేదని వ్యాఖ్య
లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తన గుజరాత్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేసే వారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చనంత వరకు అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే... కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతిస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ప్రజలు బీజేపీ 'బీ' టీంను కోరుకోవడం లేదని, సరైన ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.