పెళ్లి వేడుకలో విషాదం.. బరాత్‌లో కారు నడిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి
- ఫోన్ మాట్లాడేందుకు కారు ఆపిన డ్రైవర్
- స్టీరింగ్ అందుకున్న వరుడు.. అదుపు తప్పిన కారు
- మహిళ మృతి.. పలువురికి గాయాలు
పెళ్లి వేడుకలో భాగంగా బరాత్ నిర్వహించారు. వధూవరులతోపాటు ఆరుగురు కారులో కూర్చున్నారు. ప్రభాకర్ ఇంటి నుంచి బరాత్ బయలుదేరింది. అదే సమయంలో డ్రైవర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడేందుకు కారు ఆపి కిందికి దిగాడు. దీంతో పెళ్లి కొడుకు స్టీరింగ్ అందుకున్నాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే క్రమంలో అదుపు తప్పి వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిల్చుని బరాత్‌ను తిలకిస్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బకారపు ఉమ (35), ఆమె కుమార్తె నిఖితతో పాటు పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమను తొలుత హుజూరాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా నిన్న తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.