Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి

Minister Sandhya Rani about free bus service in Andhra Pradesh
     
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టత నిస్తున్నట్టు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిన్న శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి ఇలా బదులిచ్చారు.
Free Bus
Andhra Pradesh
Gummadi Sandhya Rani
TDP

More Telugu News