వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్... బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ
- బెయిల్ పిటిషన్ ను విచారించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు
- వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న పీపీ
- అనారోగ్యంతో ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరిన ఆయన తరపు న్యాయవాదులు
వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ... సత్యవర్ధన్ కిడ్నాప్ తో వంశీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వంశీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.