జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు
- కర్ణాటకలోని నందీపురలో శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
- కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు
- జగన్ ను కలిసిన నలుగురు పీఠాధిపతులు
జగన్ ను కలిసిన వారిలో పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్లి), జడేశ్వర తాత (శక్తిపీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ చైతన్య, కో ఫౌండర్ వీరేశ్ ఆచార్య కూడా ఉన్నారు.