వన్డేలకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వీడ్కోలు
- చాంపియన్స్ ట్రోఫీలో చివరి మ్యాచ్ ఆడేసిన ముష్ఫికర్ రహీం
- ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలం
- గత వారం రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానన్న వెటరన్
- 2006లో జింబాబ్వేతో మ్యాచ్‌లో అరంగేట్రం
2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీం 274 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 144 పరుగులు. అలాగే, కీపర్‌గా 243 క్యాచ్‌లు అందుకున్నాడు. 56 స్టంప్ ఔట్స్ చేశాడు.