BJP: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

BJP candidate Anjireddy leading in MLC election results
  • కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • తొలి ప్రాధాన్యత ఓట్లలో 5,110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
  • రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి
కరీంనగర్ -నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో చెల్లుబాటు అయినవి 2,23,343 కాగా, 28,686 చెల్లనివి ఉన్నాయి. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,11,672 ఓట్లను సాధించాల్సి ఉంది.

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు.
BJP
Graduate MLC Elections
Telangana

More Telugu News