RC16: 'ఆర్‌సీ 16' కోసం శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి.. త్వరలో సెట్స్‌లోకి ఎంట్రీ

- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఆర్‌సీ 16
- ఈ చిత్రంలో కీలక పాత్రలో కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్
- ఇటీవలే శివన్న లుక్ టెస్ట్‌ని పూర్తి చేసిన చిత్రబృందం
- త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్న శివ రాజ్‌కుమార్
- ఇతర ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు
- కథానాయికగా జాన్వీ కపూర్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో 'ఆర్‌సీ 16' (వర్కింగ్ టైటిల్) మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో 'కరుణడ చక్రవర్తి' శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఆర్‌సీ 16 షూటింగ్ గతేడాది నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు డీఓపీగా పని చేస్తున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.