vijay devarakonda: విజయ్‌ దేవరకొండ సినిమా టైటిల్‌ను లీక్‌ చేసిన 'దిల్‌' రాజు

Vijay Deverakondas movie title leaked by Dil Raju

  • విజయ్ కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేసిన 'దిల్‌'రాజు 
  • 'రౌడీ జనార్దన్ 'గా ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్‌ దేవరకొండ 
  • ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభ కానుందని తెలిపిన నిర్మాత

గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం వేచి చూస్తున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం ఈ క్రేజీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు 'రాజు వారు... రాణి గారు' చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తారు. 

కాగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రాజు ఈ చిత్రం టైటిల్‌ను లీక్ చేశాడు. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని, దీంతో పాటు నితిన్ హీరోగా 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే చిత్రాన్ని తమ సంస్థలో నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. 

  • Loading...

More Telugu News