Tamannaah: తమన్నా లవ్ బ్రేకప్?

- విజయ్ వర్మతో విడిపోయిన నటి
- పెళ్లితో ఒక్కటవుతారని భావించిన వేళ అభిమానులకు షాకింగ్ న్యూస్
- మంచి స్నేహితులుగా కొనసాగుతారని చెబుతున్న సన్నిహిత వర్గాలు
- 2023 నుంచి డేటింగ్ లో ఉన్న తమన్నా, విజయ్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ హీరో విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారనేది బహిరంగ రహస్యమే.. 2023 నుంచి కొనసాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఆ జంట పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. నిన్న మొన్నటి వరకూ ఫంక్షన్లలో జంటగా కనిపించారు. రేపోమాపో పెళ్లి వార్త చెబుతారని ఆశించిన అభిమానులకు వారి సన్నిహితులు తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పారు. తమన్నా, విజయ్ విడిపోయారని, కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. కారణం ఏమిటనేది తెలియరాలేదు కానీ, వారిద్దరూ విడిపోయారనేది మాత్రం నిజమేనంటూ పలు మీడియా సంస్థలలో వార్తలు వెలువడ్డాయి. ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని తమన్నా, విజయ్ చెబుతున్నారట. వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకుంటారని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు. ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు. కాగా, నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సందర్భంగా తమన్నా, విజయ్ ల మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ వారు డేటింగ్ లో ఉన్నారని సమాచారం. ఈ ఏడాది తమన్నా, విజయ్ పెళ్లిపీటలు ఎక్కనున్నారని ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా వారిద్దరూ ఇప్పుడు విడిపోయారని, బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం.