Salman Ali Agha: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

- పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు షాక్
- రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు
- కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల కోసం జట్ల ప్రకటన
- వన్డే కెప్టెన్సీ మాత్రం రిజ్వాన్‌కే అప్పగించిన పీసీబీ
పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళుతున్న పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. అయితే, మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం రిజ్వానే కెప్టెన్సీ చేస్తాడని పీసీబీ వెల్లడించింది. మార్చి 16 నుంచి కివీస్‌తో పాక్ ఐదు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది.
ఇక తాను ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలోనే జట్టులో కీలక మార్పుల దిశగా పీసీబీ అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కూడా ఉన్నందున ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటోంది.
కివీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పాక్ స్క్వాడ్ ఇలా..
టీ20 జట్టు: హసన్ నవాజ్, ఒమైర్ యూసుఫ్, మహ్మద్ హరీస్ అబ్దుల్ సమద్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ నియాజీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్ అబ్బాస్ అఫ్రిది, జహందాద్ ఖాన్, మహ్మద్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, సుఫియాన్, సుఫీయాన్ ముఖీం, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ ఖాన్
వన్డే జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, ఇర్ఫాన్ నియాజీ, సుఫీయాన్ ముఖీం, తయ్యబ్ తాహిర్, నసీమ్ షా.