Cricketer David Warner: నితిన్ కొత్త సినిమాలో ఆసీస్ స్టార్ క్రికెటర్

cricketer david warner to make a cameo in telugu movie producer confirmed
  • వెండి తెరపై సందడి చేయనున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
  • రాబిన్ హుడ్ మూవీలో అతిధి పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాత వెల్లడి
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక సినిమాలో నటిస్తున్నారంటూ గతంలో పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పుడు అది నిజం అవుతోంది. డేవిడ్ వార్నర్ త్వరలో వెండి తెరపై సందడి చేయనున్నారు. నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న ‘రాబిన్‌హుడ్’ తెలుగు మూవీలో డేవిడ్ అతిధి పాత్ర పోషిస్తున్నారు.  
 
హైదరాబాద్‌లో జరిగిన కింగ్ స్టన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

Cricketer David Warner
Movie News
Nitin
Rabinhood

More Telugu News