Champions Trophy 2025: ఛాంపియన్ప్ ట్రోపీ: చివరి లీగ్ మ్యాచ్ లో 179 రన్స్ కే కుప్పకూలిన ఇంగ్లండ్

England collapsed for 179 runs against SA in Champions Trophy
  • గ్రూప్-బీలో నేడు చివరి లీగ్ మ్యాచ్
  • కరాచీలో ఇంగ్లండ్ × దక్షిణాఫ్రికా 
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 38.2 ఓవర్లలో 179 ఆలౌట్
  • చెరో 3 వికెట్లతో రాణించిన యన్సెస్, ముల్డర్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లండ్ జట్టు నేడు తన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడుతోంది. పాకిస్థాన్ లోని కరాచీలో జరుగుతున్న ఈ గ్రూప్-బి పోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే, దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి బట్లర్ సేన 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. సీనియర్ ఆటగాడు జో రూట్ చేసిన 37 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. చివర్లో జోఫ్రా ఆర్చర్ 25 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 

ఓపెనర్ బెన్ డకెట్ 24, కెప్టెన్ జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ (0) డకౌట్ అయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో యన్సెన్ 3, వియాన్ ముల్డర్ 3, కేశవ్ మహరాజ్ 2, లుంగి ఎంగిడి 1, రబాడా 1 వికెట్ తీశారు.
Champions Trophy 2025
England
South Africa
Karachi

More Telugu News