ఇంకా జనాల వద్ద రూ.2 వేలు కరెన్సీ నోట్లు... ఆర్బీఐ నివేదికలో ఆసక్తికర అంశాలు

  • గతంలో రూ.2 వేల నోటు తీసుకువచ్చిన కేంద్రం
  • కొంత కాలానికి మార్కెట్ నుంచి ఉపసంహరణ
  • ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేలు నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గతంలో కొన్ని రకాల కరెన్సీ  నోట్లను రద్దు చేసి, రూ.2 వేల నోటును తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం... కొన్ని నాళ్లకే రూ.2 వేల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ, ప్రజల వద్ద ఇంకా రూ.2 వేలు కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. చలామణిలో ఉన్న రూ.2 వేలు కరెన్సీ నోట్లలో 98.18 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల వద్ద చేరినప్పటికీ... ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేలు నోట్లు ఉన్నాయని వివరించింది. 

కాగా, బ్యాంకులద్వారా రూ.2 వేలు నోట్లను మార్చుకునే వెసులుబాటు 2023 అక్టోబరు 7వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడికి, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉందని... తమ కార్యాలయాల వద్దకు రాలేని వారు పోస్టల్ శాఖ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.


More Telugu News