వర్షంతో మ్యాచ్ రద్దు... ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో అడుగుపెట్టిన ఆసీస్
- ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ × ఆఫ్ఘన్
- ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్
- ఇరు జట్లకు చెరో పాయింట్
- మొత్తం 4 పాయింట్లతో సెమీస్ బెర్తు కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
వర్షం వల్ల నిలిచిన మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోగా, డీఎల్ఎస్ వర్తింపజేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మొత్తం 4 పాయింట్లతో ఆసీస్ సెమీస్ లో అడుగుపెట్టింది.
మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ కు కూడా సెమీస్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్నాయి. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 207 పరుగుల భారీ తేడాతో గెలిస్తే... దక్షిణాఫ్రికా రన్ రేట్ ఆఫ్ఘన్ రన్ రేట్ కంటే దిగువకు పడిపోతుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి రెండో జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ బెర్తు దక్కించుకుంటుంది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.