గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టులో భారీ ఊరట!

  • ఐదు పోలీస్ స్టేషన్‌లలో విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదు
  • ఈ కేసులపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు
  • మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసుల కొట్టివేత
గోషామహల్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఆయన మీద ఉన్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్‌లో ఐదు పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు, మరోసారి ఇలాంటి ప్రసంగాలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసులను కొట్టివేసింది.

మహాశివరాత్రి సందర్భంగా ఆయన విడుదల చేసిన ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా హిందువుల దుకాణాల్లో మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలని, పూజా సామాగ్రి కొనేముందు అమ్మకందారులు పవిత్రంగా ఉన్నారా లేదా చూసుకోవాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా చూడాలని సూచించారు. ప్రతిరోజు స్నానం చేసేవారి వద్ద మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలని వీడియోలో సూచించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.


More Telugu News