శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' టైటిల్‌ టీజర్ వచ్చేసింది!

  • శ్రీ విష్ణు 18వ చిత్రంగా 'మృత్యుంజయ్' 
  •  శ్రీ విష్ణు బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ టీజర్ విడుదల 
  • ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా నటిస్తున్న శ్రీ విష్ణు


వరుస సినిమాలతో దూసుకుపోతున్న కథానాయకుడు శ్రీ విష్ణు. నేటి తరం యువ హీరోలలో ఆయనది ప్రత్యేక శైలి. సినిమా సినిమాకు జానర్‌ను మారుస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ విష్ణు చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'మృత్యుంజయ్‌'. షా కిరణ్ దర్శకుడు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను శుక్రవారం శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తారు. టైటిల్ టీజర్‌ను గమనిస్తే వాయిస్ ఓవర్‌లో 'గేమ్ ఓవర్ జయ్' అనే డైలాగ్ వినిపిస్తోంది. శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు టీజర్‌లో ఉన్నాయి. ఇందులో హీరోని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూడవచ్చు. ఇక చివర్లో 'నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు' అనే డైలాగ్‌తో ఆయన పాత్ర ఔచిత్యం తెలుస్తుంది.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. 




More Telugu News